Tuesday 3 June 2014

శ్రీ S P బాలు గారి మెడ్లీ పాటలు


నేడు  శ్రీ S P బాలు గారి జన్మ దినం . భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వేడుకొందాము. 

"పాడుతా-తీయగా" కార్యక్రమం ద్వారా ఎందరో గాయకులను, గాయనీ మణులను పరిచయం చేస్తూ, నిర్విరామంగా

 సేవలు చేస్తున్న మహా గాయకుడు బాలు గారు. 

ఆయన పడిన కొన్ని మెడ్లీ పాటలు ఇక్కడ విందాము.  ఇది విజయవాడ క్లబ్ వారు నిర్వహించిన కార్యక్రమంలో శ్రీ  బాలు గారు పాడిన పాటలే ఇవి.







Thursday 6 March 2014

'కంచికి పోతావా కృష్ణమ్మా'


1980 లో విడుదలైన "శుభోదయం" చిత్రానికి దర్శకుడు శ్రీ K విస్వనథ్. సంగీతం శ్రీ కే వీ మహదెవన్. శ్రీ బాలు, సుశీల పాడిన 'కంచికి పోతావా కృష్ణమ్మా' ఒక చక్కటి పాట. రచన శ్రీ వేటూరి.








Saturday 18 January 2014

" విధాత తలపున ప్రభవించినది .. అనాది జీవన వేదం"


శ్రీ కే విశ్వనాధ్ గారి దర్సకత్వంలో రూపు దిద్దుకొన్న కళా  ఖండం 
" సిరివెన్నెల" చిత్రం. శ్రీ సీత రామ శాస్త్రి గారికి ఎనలేని పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టిన చిత్రమే కాకుండా, తన ఇంటి పేరే  'సిరివెన్నెల గా నిలిచి పోయింది. ఈ చిత్రానికి సంగీతం శ్రీ K V మహదెవన్. పాటలన్నీ సూపర్ డూపర్ హిట్స్. శ్రీ బాలసుబ్రహ్మణ్యం, జానకి తో కలిసి పాడిన గీతం 
  " విధాత తలపున ప్రభవించినది .. అనాది జీవన వేదం" ఎంతో ఉదాత్తమైన పాట. సాహితీ పరంగా ఉన్నత శ్రేణి లో ఉన్న పాట. కష్టమైన పాట అయినా , బాలు గారి గళం లో అవలీల గా వెలువడింది.  ఆ పాట విందాము.








Thursday 2 January 2014

' ఆగదు ఏ నిముషం నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము'

అన్నపూర్ణ సంస్థ నిర్మించిన చిత్రం " ప్రేమాభి షేఖం ".  చిత్ర దర్శకుడు శ్రీ దాసరి నారాయణ రావు . మంచి కథ, మంచి సంగీతం, అక్కినేని, శ్రీదేవి, జయసుధ ల ఉత్తమ నటన తో పాటు, శ్రీ బాలసుబ్రహ్మణ్యం పాటలు, చిత్ర విజయానికి ఎంతో తోడ్పడ్డాయి అందడం లో ఎంత మాత్రం సంశయం లేదు.  అన్ని పాటలకు శ్రీ బాలు గారు ప్రాణం పోసారు.  ముఖ్యంగా చిత్రం లో వచ్చే చివరి పాట ' ఆగదు ఏ నిముషం నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము' ఎంతో భావగార్భంగా పాడి, చిత్రానికే వన్నె తెచ్చారు. ఇప్పటికి ఈ పాట వింటే, కళ్ళలో నీళ్ళు వస్తాయి. గీత రచన శ్రీ దాసరి, సంగీతం శ్రీ చక్రవర్తి.   బాలు గారి సినీ ప్రస్థానంలో ఒక ఉత్తమ పాటగా నిలిచిపోయింది ఈ పాట.   ఆ పాట విందాము.




Wednesday 25 December 2013

"ఓంకార నాధాలు సంధానమౌ గానమే శంకరాభరణము"





Sankarabharanam.jpg
శ్రీ K విశ్వనాధ్ అద్భుత శ్రుష్టి 'శంకరాభరణం'  ఈ చిత్రం 1979 లో విడుదలై సంచలన విజయం సాదించి, అటు పండితులను, అటు పామరులను విశేషంగా అలరించిన గొప్ప మేటి చిత్రం. శ్రీ కే వీ మహదేవన్ సమకూర్చిన సంగీతం ఒక మలయ మారుతంలా సినీ రశగ్నులను ఓల లాడించింది. శ్రీ S P  బాలు గారికి ఎనలేని కీర్తి సమకూర్చిన చిత్రం. ఈ చిత్రం లో దాదాపు అన్ని పాటలు బాలు గారు పాడారు. అన్నీ సూపర్ డూపర్ హిట్స్.  ఈ చిత్రంలో మొదటగా వినిపించే పాట "ఓంకార నాధాలు  సంధానమౌ గానమే శంకరాభరణము". పాట వింటుంటే ఏదో లోకాల్లో విహరించి నట్లు ఉంటుంది. బాలు గారు అద్భుతంగా పాడి మన్ననలు అందుకొన్నారు. గీత రచన శ్రీ వేటూరి సుందర రామమూర్తి.  ఆ పాట విందాము. వీడియో క్లిప్పింగ్ యు ట్యూబ్ సహకారంతో సేకరించడం జరిగిన్ది. వారికి మా కృతజ్ఞతలు.




Saturday 14 December 2013

"ఇది మేఘ సందేశమో .. అనురాగ సంకేతమో'

మధురం మధురం ఈ సమయం అనే శీర్షిక క్రింద శ్రీ యస్ వీ రామారావు గారు కొన్ని ప్రోగ్రాం లు చేసారు. ఇక్కడ ఈ శీర్షిక లో ఏడంతస్తుల మేడ చిత్రం గురించి , ఆ చిత్రం లోని పాటలను విశ్లేషించారు. 
                                   "ఇది మేఘ సందేశమో .. అనురాగ సంకేతమో'
 మంచి మెలోడి పాట. బాలు గారు, సుశీల గారుఎంతో అద్భుతంగా పాడారు. ఇప్పుడు ఆ చిత్రంలోని పాటలు విందాము. యు ట్యూబ్ సహకారంతో పోస్ట్ చేయడం జరిగింది. వారికి  ధన్యవాదాలు. 

Friday 13 December 2013

" కలువకు చంద్రుడు ఎంతో దూరం..కమలానికి సూర్యుడు మరీ దూరం "

చిల్లర దేవుళ్ళు చిత్రం 1975 లో విడుదల. ఈ చిత్రానికి సంగీతం శ్రీ K V మహదెవన్.  ఆత్రేయ కలం నుండి జాలు వ్రాలిన గీతం " కలువకు చంద్రుడు ఎంతో దూరం..కమలానికి సూర్యుడు మరీ దూరం " ఒక చక్కటి పాట. ఈ పాటను అంతే చక్కగా శ్రీ బాలు గారు పాడారు.  ప్రతియొక్క మనిషి హృదయాన్ని కదిలించక మానదు ఈ పాట. ఆ పాట విందాము .

కలువకు చంద్రుడు ఎంతో దూరం..
కమలానికి సూర్యుడు మరీ దూరం..  (2)

దూరమైన కొలదీ.. పెరుగును అనురాగం..
విరహంలోనే ఉన్నది అనుబందం.. ........                                కలువకు

నవ్వు నవ్వుకు తేడా వుంటుందీ..
నవ్వే అదృష్టం ఎందరికుంటుంది??
ఏ కన్నీరైనా వెచ్చగ వుంటుందీ..
అది కలిమిలేములను మరిపిస్తుంది.. ............                        కలువకు    

వలపు కన్నా తలపే తీయనా..
కలయిక కన్నా కలలే తీయనా..
చూపులకన్నా ఎదురుచూపులే తీయనా..
నేటి కన్నా రేపే తీయనా..  ................                                   కలువకు       
    
మనసు మనిషిని మనిషిగా చేస్తుందీ..
వలపా మనసుకు అందానిస్తుంది..
ఈ రెండూ లేక జీవితమేముంది??
ఆ దేవుడికీ మనిషికీ తేడా ఏముంది??  ............ కలువకు

..