Wednesday 25 December 2013

"ఓంకార నాధాలు సంధానమౌ గానమే శంకరాభరణము"





Sankarabharanam.jpg
శ్రీ K విశ్వనాధ్ అద్భుత శ్రుష్టి 'శంకరాభరణం'  ఈ చిత్రం 1979 లో విడుదలై సంచలన విజయం సాదించి, అటు పండితులను, అటు పామరులను విశేషంగా అలరించిన గొప్ప మేటి చిత్రం. శ్రీ కే వీ మహదేవన్ సమకూర్చిన సంగీతం ఒక మలయ మారుతంలా సినీ రశగ్నులను ఓల లాడించింది. శ్రీ S P  బాలు గారికి ఎనలేని కీర్తి సమకూర్చిన చిత్రం. ఈ చిత్రం లో దాదాపు అన్ని పాటలు బాలు గారు పాడారు. అన్నీ సూపర్ డూపర్ హిట్స్.  ఈ చిత్రంలో మొదటగా వినిపించే పాట "ఓంకార నాధాలు  సంధానమౌ గానమే శంకరాభరణము". పాట వింటుంటే ఏదో లోకాల్లో విహరించి నట్లు ఉంటుంది. బాలు గారు అద్భుతంగా పాడి మన్ననలు అందుకొన్నారు. గీత రచన శ్రీ వేటూరి సుందర రామమూర్తి.  ఆ పాట విందాము. వీడియో క్లిప్పింగ్ యు ట్యూబ్ సహకారంతో సేకరించడం జరిగిన్ది. వారికి మా కృతజ్ఞతలు.




1 comment:

  1. నమస్కారం వెంకోబారావు గారు. చాల చక్కని పాట. శంకరాభరణం వచ్చి దాదాపు 25 సంవత్సరాలు పైనే అయిందంటే నమ్మలేం ఒకోసారి. ఈ పాట పల్లవిలో చిన్న సవరణ. ఇది "ఓంకార నాదానుసంధానమౌ గానమే" అని వుండాలి. నాదానికి అనుసంధానము. చిత్రం పేరు విశ్వనాథ్ గారు చెప్పగానే వేటూరిగారు వెనువెంటనే చెప్పిన పల్లవి యిది అని విన్నాను.

    ReplyDelete